Thursday, January 23, 2025

ఆరోగ్య పరిరక్షణలో “విటమిన్ డీ” కీలకం

- Advertisement -
- Advertisement -

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు, విటమిన్లు చాలా అవసరం. విటమిన్లలో డీ విటమిన్ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపర్చడంలో విటమిన్ డీ చాలా ముఖ్యం. అయితే విటమిన్ డీ ఎక్కువైనా, తక్కువైనా కష్టమే. ఆహారం నుంచి కాల్షియాన్ని గ్రహించడానికి విటమిన్ డీ సహాయపడుతుంది. ఇది అధికంగా ఉంటే రక్తంలో కాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉండి, హైపర్కాల్సెమియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

హైపర్కాల్సెమియా ఉన్న వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. గందరగోళం, నిరాశ, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరీ తీవ్రమైతే కోమా లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కాల్షియం స్థాయి పెరిగి తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. విటమిన్ డీ లోపం వల్ల కూడా తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డీ చాలా అవసరం. ఆరోగ్యకర వ్యాధి నిరోధక వ్యవస్థకు విటమిన్ డీ బాధ్యత వహిస్తుంది.

ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడి కణాలను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. జలుబు, లేదా ఫ్లూ వంటి సమస్యలు ఎదురైతే విటమిన్ డీ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవడం అవసరం. విటమిన్ డీ లోపిస్తే శరీరం తరచూ ఒత్తిడికి గురవుతుంది. అలాంటి సమయంలో సూర్యకాంతిలో ఉంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. బహిష్టులాగిన మహిళల్లో స్థూలకాయానికి తోడు విటమిన్ డీ లోపిస్తే రొమ్ము క్యాన్సర్ సంక్రమించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది.

నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. బ్రెజిల్‌కు చెందిన 600 మంది మహిళలను అధ్యయనంలో తీసుకున్నారు. విటమిన్ డీ అత్యధిక స్థాయిలు తక్కువ శరీర సౌష్ఠవం కలిగిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మరణాల శాతాన్ని 50 శాతం వరకు తగ్గిస్తాయని రొమ్ము క్యాన్సర్ కణాలను నియంత్రిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బహిష్టులాగిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడే విటమిన్ డీ లోపించే రిస్కు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News