Saturday, December 21, 2024

న్యాచురల్ ఫ్యామిలీ సెలూన్ ని ప్రారంభించిన వితికా, నోయల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సంతోష్ నగర్ వద్ద న్యాచురల్స్ ఫ్యామిలీ సెలూన్‌ తమ నూతన బ్రాంచ్‌‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నటీనటులైన వితికా షేరు, నోయల్‌తో పాటు పలువురు మోడల్స్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నటి వితికా షేరు మాట్లాడారు.. బ్యూటీ రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందని.. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. న్యాచురల్స్ ఫ్యామిలీ సెలూన్‌తో తనకీ అనుబంధం ఉందని.. చాలా ఫంక్షన్స్‌కి ఇందులోనే రెడీ అయి వెళతానని తెలిపారు. న్యాచురల్స్ వారి సర్వీస్ చాలా బాగుంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాచురల్స్ ఫౌండర్ వీణ, కో ఫౌండర్ సి కె కుమారవేల్, సిఒఒ ఆపరేషన్ హెడ్ అరవింద్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా న్యాచురల్స్ ఫ్యామిలీ సలోన్ & స్పా నిర్వాహకులు ఫణి చౌదరి మాట్లాడారు. తాము న్యాచురల్ ఫ్యామిలీ సెలూన్‌ని కేవలం ప్రజలు కనిపించే విధానంలో మార్పు తీసుకురావటానికి మాత్రమే కాదని, జీవితం పట్ల వారి దృక్పథంలో కూడా తాము మార్పులు తీసుకరానున్నామని తెలిపారు. ఇందులో ప్రత్యేకమైన గ్రూమింగ్ సేవలని సెలెబ్రిటీలు, స్టార్లకి సర్వం సిద్ధం చేయటంతో పాటుగా చిక్, ట్రెండ్ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సేవలని విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News