Saturday, December 21, 2024

హోమో వ్యాఖ్యలతో దుమారం

- Advertisement -
- Advertisement -

Vivek Agnihotri faces flak over Bhopali

కశ్మీర్ ఫైల్ దర్శకుడికి భోపాల్ సెగ

భోపాల్ : ది కశ్మీర్ ఫైల్ సినిమా దర్శకులు వివేక్ అగ్నిహోత్రికి భోపాల్ చిక్కులు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్ నగరం భోపాల్ అంటేనే స్థానిక పరిభాషలో స్వలింగ సంపర్కం అని వివేక్ వ్యాఖ్యానించారు. ఓ ఆన్‌లైన్ ఛానల్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వూలో వివాదాస్పదంగా మాట్లాడారు. భోపాల్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన వివేక్‌కు నిరసనలు వ్యక్తం అయ్యాయి. భోపాల్‌ను కించపరుస్తూ మాట్లాడటం భావ్యం కాదని మాజీ సిఎం , కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఇంటర్వూలో వివేక్ ఈ విధంగా వ్యాఖ్యానించారు “ నేను భోపాల్‌లో పెరిగాను. కానీ భోపాలీని కాను. భోపాలీ పదానికి వేరే అర్థం ఉంది. దీని గురించి ఏ భోపాలీని అడిగినా చెపుతారు.

తెలియని వారికోసం నేను తెలియచేస్తాను. ఎవరైనా తాను భోపాలీని అంటే స్వలింగ సంపర్కులు అని తెలియచేసుకున్నట్లే. నవాబీ సంబంధాలు ఉన్న వ్యక్తిగా లెక్కలోకి తీసుకోవాలి” అని వివేక్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ దీనికి కౌంటర్ ఇస్తూ వివేక్ అగ్నిహోత్రి వ్యక్తిగత అనుభవం వేరే విధంగా ఉన్నట్లుంది. తానైతే భోపాల్‌లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను. భోపాలీలతో అనుబంధం ఉంది. ఇటువంటి విచిత్ర వ్యాఖ్యానాలు తగవని సలహా ఇచ్చారు. ఏది ఏమైనా ఎవరైనా వారివారి సన్నిహిత బృందాన్ని బట్టి ప్రభావితులు అవుతారు. అనుగుణంగానే మాట్లాడుతారు. వివేక్ కంపెనీ అటువంటిదేమో అని దిగ్విజయ్ ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News