Wednesday, January 22, 2025

ఉద్యమకారులను కెసిఆర్ పక్కన పెట్టారు: వివేక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిపక్షాలను ఇడి, ఐటి దాడులతో వేధిస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం వివేక్ మీడియాతో మాట్లాడారు. దోపిడీ చేయడానికే కాళేశ్వరం డిజైన్ మార్చారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోసం గతంలో తాను పార్లమెంట్‌లో పోరాటం చేశామని, తెలంగాణ కోసం కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఒప్పించానని గుర్తు చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని హైకమాండ్‌కు వివరించానన్నారు. తెలంగాణ కోసం తనతో పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్ కూడా పోరాటం చేశారని వివేక్ గుర్తు చేశారు. సోనియా వల్లే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందని, బిల్లు ఆమోదానికి స్పీకర్ మీరా కుమార్ సహకరించారని, పది ఏళ్లలో సిఎం కెసిఆర్ కుటుంబమే బాగుపడిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, మిషన్ భగీరథలో 80 వే కోట్ల స్కామ్ జరిగిందని వివేక్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను సిఎం కెసిఆర్ పక్కన పెట్టారని, రాజకీయాల్లో విలువలకు తాను ప్రాధాన్యం ఇచ్చానని, తన సపోర్ట్‌తోనే కొప్పుల ఈశ్వర్ గెలిచారని, చెప్పుడు మాటలు విని కెసిఆర్ తనని పక్కన పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కెసిఆర్ పని చేశారని ఆయన మండిపడ్డారు. చెన్నూరులో ఎంఎల్‌ఎ బాల్కసుమన్ అరాచకాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News