Monday, December 23, 2024

నిరాడంబరంగా కమెడియన్ కూతురి పెళ్లి

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ దివంగత కమెడియన్ వివేక్ గురించి ప్రేత్యకంగా చెప్పనక్కరలేదు. అతడు టైమింగ్ కమెడితో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు. తమిళంలో చాలా సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించినప్పటికి తెలుగులో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించాడు. 2021లో వివేక్ గుండెపోటుతో చనిపోయారు. వివేక్ కూతురు తేజస్విని, భరత్ అనే యువకుడిని మార్చి 28న వివాహం చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్క పద్మావతి నగర్‌లోని వివేక్ నివాసంలో అతికొద్ది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం సాధారణంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలో భాగంగా తన తండ్రి జ్ఞాపకార్థం వివేక్ కమార్తె తేజస్విని తన భర్తతో కలిసి మొక్కలు నాటింది. పెళ్లికి వచ్చిన అతిథులకు మొక్కలను కానుకలుగా ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. వెండితెరపై తన నటనతో నవ్వించిన వివేక్ నిజ జీవితంలో చాలా మందికి రోల్ మోడల్ అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. వివేక్ బతికి ఉన్నప్పుడు అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకొని లక్షలాది మొక్కలు నాటారు. చాలాసార్లు ప్రకృతిని కాపాడాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News