Wednesday, January 22, 2025

బుల్ ఫైట్ లాంటి సినిమా..

- Advertisement -
- Advertisement -

మలయాళ సూపర్‌స్ట్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హై యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ ‘కడువా’. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘కడువా’ ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

హై యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా అలరించింది ఈ టీజర్. డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్‌ని చూపి ంచబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుం ది. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ… కడువా నాకు చాలా ప్రత్యెకమైన సినిమా. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. భవిష్యత్‌లో నా చిత్రాలన్నీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా అని అన్నారు. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ… ‘కడువా’ రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్‌లా ఈ సినిమా వుంటుంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని తెలిపారు. హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. భీమ్లా నాయక్ విడుదల అప్పుడు థియేటర్‌లో ఒక పండగ లాంటి వాతావరణం చూశాను. కడువా చూస్తున్నపుడు కూడా సేమ్ అదే సెలబ్రేషన్స్ వుంటాయని భావిస్తున్నా అని అన్నారు.

Vivek Oberoi speech about ‘Kaduva’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News