Friday, November 22, 2024

ట్రంప్ క్యాంప్‌లో మరింత జోరు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచార దశలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకూల శిబిరంలోకి బ్రియాన్ స్వెన్‌సెన్ వచ్చి చేరారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష బరిలో ఇప్పుడు ప్రధాన వ్యక్తిగా ఉన్న భారతీయ సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి ఇప్పటివరకూ బ్రియాన్ కుడిభుజంగా నిలిచారు. వివేక్ రామస్వామి ప్రచార బాధ్యతలు తీసుకుంటూ నేషనల్ పొలిటికల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ రామస్వామికి వేవ్ తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. తన బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్లు అధికారికంగా తెలిపారు. దీనితో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామస్వామి ప్రచారం కుంటుపడే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు తెలిపారు.

బ్రియాన్ త్వరలోనే ట్రంప్ తరఫున ప్రచారం సాగిస్తారు. ముందుగా ఓటింగ్ జరిగే రాష్ట్రాలలో ప్రత్యేకించి నెవాడాలో ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా బ్రియాన్ ప్రచారం ఉంటుందని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. ట్రంప్‌తో తలపడేందుకు సిద్ధపడుతున్న రామస్వామి ఇటీవలి కాలంలో ఆయనను ప్రశంసించారు. రిపబ్లికన్ పార్టీ రేసులో ముందున్న ట్రంప్ 21వ సెంచరీలోనే బెస్ట్ ప్రెసిడెంట్ అని ఆకాశానికి ఎత్తారు. కాగా రామస్వామి బృందం నుంచి వీడియోగ్రాఫర్లు ఇతర వ్యక్తులు కూడా వైదొలుగుతున్నారు. ఇక బ్రియాన్ నిర్ణయంపై రామస్వామి అధికార ప్రతినిధి ట్రికా మెక్‌లౌగ్లిన్ స్పందిస్తూ ఆయన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా ఆయనకు మంచి జరగాలని కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News