న్యూస్‌డెస్క్: వచ్చే ఏడాది(2024) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు భారత, అమెరికా వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని బదక్కెన్‌చేరి నుంచి వివేక్ రామస్వామి తల్లిదండ్రులు వలస వచ్చారు. స్ట్రైవ్ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ సహవ్యవస్థాపకుడైన వివేక్ ప్రస్తుం ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.
స్ట్రైవ్‌ను స్థాపించడానికి ముందు ఆయన బయో ఫార్మసీ కంపెనీ రాయ్‌వంట్ సైన్సెస్‌ను స్థాపించారు. అనేక పుస్తకాలను కూడా ఆయన రచించారు. వోక్ ఇన్‌కార్పొరేటెడ్: ఇన్‌సైడ్ కార్పొఏట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్(2021లో ప్రచురణ), నేషన్ ఆఫ్ విక్టిమ్స్:ఊడెంటిటీ పాలిటిక్స్, ది డెత్ ఆఫ్ మెరిట్, అండ్ ది దెత్ బ్యాక్ టు ఎక్సెలెన్స్(2022లో ప్రచురణ) వంటివి ఆయన రాసిన రచనలు. మంగళవారం వివేక్ ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ వద్ద అభ్యర్థిత్వ ప్రకటన దఖలు చేశారు. అయోవాలో గురువారం పోక్ కౌంటీ రిపబ్లికన్ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.