- Advertisement -
అమెరికా అధ్యక్ష పదవి రేసులోంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఐయోవా ప్రైమరీ కాకసస్ లో జరిగిన ఓటింగ్ లో వివేక్ కు 7.7 శాతం ఓట్లు రాగా, ట్రంప్ కు 51 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తాను వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇక్కడతో తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని, అమెరికా అధ్యక్షుడినయ్యేందుకు తనకు అవకాశం లేదని భావిస్తున్నానని వివేక్ రామస్వామి అన్నారు.
భారతీయ అమెరికన్ అయిన వివేక్ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. మొదటినుంచీ ఆయన ట్రంప్ మార్గంలోనే నడుస్తున్నారు. ఇద్దరూ నిన్న మొన్నటివరకూ కలసిమెలసి ఉన్నా, ఈమధ్య వివేక్ పై ట్రంప్ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది.
- Advertisement -