Friday, November 22, 2024

ట్రంప్‌తో కలిసి సహ అభ్యర్థిగా పోటీలో ఉంటా : వివేక్ రామస్వామి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్/లండన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ సంతతి వివేక్ రామసామి పోటీలో తన సహఅభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని , రిపబ్లిక్ అభ్యర్థిత్వం ఆయనకు రాకపోయినాసరే తాను కలిసే పోటీచేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయ నేతగా మారిన మల్టీ మిలియనీర్ ,బయోటెక్ వాణిజ్యవేత్త 38 ఏళ్ల రామస్వామి తనకు అధ్యక్ష పదవి తప్ప మరే ఉద్యోగంపై ఆసక్తి లేదన్నారు. అధ్యక్షునిగా తాను దేశాన్ని తిరిగి సమైక్య పరుస్తానని విశ్వాసం ప్రకటించారు. మూడోసారి ట్రంప్ ఉపాధ్యక్షునిగా గెలిచే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. బ్రిటన్ జిబి వార్తాసంస్థ ఉపాధ్యక్ష పదవిపై చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా, అది నాగురించి కాదని, నాగురించే అయితే ఉపాధ్యక్ష పదవి కూడా తన వయసు వారికి తగినదేనని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News