Wednesday, January 22, 2025

మైనే, కొలరాడో స్టేట్ బ్యాలెట్ల నుంచి పోటీ విరమిస్తా : వివేక్ రామస్వామి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా పేర్కొంటూ మైనే, కొలరాడ్ స్టేట్ బ్యాలెట్ల నుంచి ట్రంప్ పేరును తొలగించడాన్ని ఇండోఅమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి తప్పు పట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ట్రంప్‌కు మద్దతుగా తాను మైనే, కొలరాడక్ష స్టేట్ బ్యాలెట్ల నుంచి పోటీ విరమించుకుంటానని పునరుద్ఘాటించారు. ఆ రెండు రాష్ట్రాల బ్యాలెట్లను రద్దు చేయడమే తన లక్షంగా రామస్వామి వివరించారు. తాను అనుసరించిన రీతి లోనే తన ప్రత్యర్థులు ఆ రాష్ట్రాల నుంచి పోటీ నుంచి విరమించుకోవాలని అభ్యర్థించారు. స్టేట్స్ రాజ్యాంగ విరుద్ధంగా ట్రంప్‌ను పోటీ చేయకుండా తొలగిస్తే రిపబ్లికన్ అభ్యర్థులంతా ఈ విధానాన్ని ప్రతిఘటిస్తారని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News