Monday, November 18, 2024

గెలిస్తే 75 శాతం ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..ఆసామి వివేక్ రామస్వామి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే 75 శాతం వరకూ ప్రభుత్వ ఉద్యోగులను తీసివేస్తాను. అధికారిక దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐని మూసివేయిస్తానని రిపబ్లికన్ అభ్యర్థి, ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామి ప్రకటించారు. ఎఫ్‌బిఐ ఒక్కటే కాదు పలు ఇతర సంస్థలపై కూడా వేటేస్తానని వివరించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన ఇప్పుడు పార్టీ అంతర్గత ప్రైమరీ పోటీల్లో ఉన్నారు. ఈ ఇండో అమెరికన్ అమెరికాలో అత్యంత సంపన్నుడైన యువ పారిశ్రామికవేత్తగా నిలిచారు. సంస్కరణల భాగంగా తాను పలు ప్రతిపాదనలకు దిగుతానని వివేక్ రామస్వామి అమెరికా న్యూస్‌వెబ్‌సైట్ ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ముందు ఫెడరల్ ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ, ఎఫ్‌బిఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టోబాకో,మారణాయుధాలు పేలుడు పదార్థాలు, ఎన్‌ఆర్‌సి, ఐఆర్‌ఎస్, వాణిజ్య విభాగం ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు.

పదవిలోకి వచ్చిన రోజునే ఈ పనిచేస్తానని తెలిపిన వివేక్ రామస్వామి ఏడాదిలోగా ఫెడరల్ ఉద్యోగులలో 50 శాతం ఇంటికి వెళ్లేలా చేస్తానని చెప్పారు. ఈ ఉద్యోగులలో దాదాపు 30 శాతం వరకూ వచ్చే ఐదేళ్లలో రిటైరయ్యే వారే ఉన్నారని వివరించారు. బ్యూరోక్రసీలో ప్రస్తుతం నెలకొన్న అలసత్వం గమనించే తాను ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో సలహాదార్లు, వివిధ స్థాయిల్లో సభ్యులు ఉండటం వల్ల నిజానికి కార్యనిర్వహణ బాధ్యతల్లో ఉండే వారు ఏమి చేయలేరనే సత్యం కీలకమైనదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 23 లక్షల మంది వరకూ ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతంపై వేటువేయడం అంటే దాదాపు 17 లక్షల మంది వరకూ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. దీనితో ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతుందని , కానీ దీనితో ప్రభుత్వ నిర్వహణ క్లిష్టం అవుతుందని వెంటనే విమర్శలు తలెత్తాయి.

అయితే ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడమే తన పని అని తెలిపిన వివేక్ ప్రతి శాఖలో సమర్థతకు హెచ్‌ఆర్ వ్యవస్థ కీలకం . అట్టడుగు స్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకునే బాధ్యతలలో హెచ్‌ఆర్ వ్యవస్థ ఉంటుంది, కానీ చివరికి సిఇఒకు చెప్పకుండా హెచ్‌ఆర్ ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ కూడా ఇదే విధంగా ఉంది, ఎన్నో చేయాలనుకుంటుంది, కానీ ఉదాసీతతో నడుస్తోంది కదా అనే ధోరణితో ఏమి చేయలేకుండా పోతోందని, దీనికి బ్రేక్ వేయాల్సి ఉందని ఈ భారతీయ మూలాల వ్యక్తి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News