Thursday, December 19, 2024

బెంగాల్ కొత్త డిజిపిగా వివేక్ సహాయ్

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త డిజిపిగా వివేక్ సహాయ్‌ను సోమవారం నియమించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.డిజిపి పదవిలో నుంచి రాజీవ్ కుమార్‌ను ఎన్నికల కమిషన్ (ఇసి) తొలగించిన కొన్ని గంటల తరువాత ఈ నియామకం జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. 1998 బ్యాచ్ ఐపిఎస్ అధికారి వివేక్ సహాయ్ ఇంతకుముందు హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్, కమాండెంట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో క్రియాశీలక ఎన్నికల నిర్వహణ విధుల నుంచి రాజీవ్ కుమార్‌ను తొలగించిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన బదలీ నిర్ణయం జరిగింది.

రాజీవ్ కుమార్‌ను ఎన్నికలతో సంబంధం లేనిపదవిని తిరిగి కేటాయించి, ఆయనకు జూనియర్ అయిన అధికారిని తాత్కాలికంగా డిజిపిగా నియమించాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిపి గోపాలికను ఇసి ఆదేశించింది. ఇసి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఇసి పరిశీలనకు ముగ్గురు అధికారులు వివేక్ సహాయ్, సంజయ్ ముఖర్జీ, రాజేష్ కుమార్ పేర్లను అందజేసింది. వివేక్ సహాయ్ బెంగాల్‌లో భద్రత విభాగం డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 మార్చిలో ఆయనను ఇసి సస్పెండ్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News