Friday, January 24, 2025

కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి..

- Advertisement -
- Advertisement -

మాజీ ఎంపి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరారు. శంషాబాద్ నోవాటెల్ లో ఉన్న రాహుల్ గాంధీని కలిసి ఆయన సమక్షంలో తన కుమారుడు వంశీ కృష్ణతోపాటు వివేక్ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశాలను బిఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. కెసిఆర్ కుటుంబం.. తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని విమర్శించారు.

టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని.. కాంగ్రెస్ నిర్ణయం మేరకు పనిచేస్తానని చెప్పారు. బిఆర్ఎస్ ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కు ఉందని.. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. వివేక్ చేరికతో కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News