Saturday, November 23, 2024

ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు: వివేక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసుతో బిఆర్‌ఎస్ నేతలకు సంబంధం ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. పోలీసులు సైతం బిఆర్‌ఎస్ కార్యకర్తల్లా మారిపోయారని ఆరోపించారు. పేపర్ లీక్‌పై బిజెపి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఓడిపోయే అవకాశాలు ఎక్కువయ్యాయని బిఆర్‌ఎస్‌కు తెలిసిపోయిందని, అందుకే ఇలా ప్రశ్నించే వారిపై అటాక్ చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News