Friday, January 24, 2025

నేను బిజెపికి రాజీనామా చేయను : వివేక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నేను బిజెపికి రాజీనామా చేయ్యనని.. ఆ పార్టీ నేత, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ మారతానంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బిజెపి అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బిజెపి నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు. మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బిజెపికి రాజీనామా చేయడం బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదని.. ఇది అందరూ ఊహించినదేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News