Saturday, November 23, 2024

ఫోన్ డేటాతోనే అవినాష్ కు సంబంధం ఉందని తెలుస్తుంది: సునీత

- Advertisement -
- Advertisement -

అమరావతి: దివంగత మాజీ ఎంపి వైఎస్ వివేకానంద పేరు ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారని వైఎస్ సునీత తెలిపారు. వైఎస్ షర్మిలకు ఎంపి సీటు ఇవ్వాలని జగన్‌ను వివేకా అడిగారని, దీంతో వివేకాను ఓటరు జాబితా నుంచి తీసివేస్తే షర్మిలకు ఆయన మద్దతు ఉండదన్నారు. వివేకా హత్య కేసు గురించి సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హత్య కేసులో మొదటి ఛార్జిషీట్‌లో సిబిఐ నలుగురి నిందితుల పేర్లు చెప్పిందని, ఏ1-ఎర్ర గంగిరెడ్డి, ఏ2- సునీల్ యాదవ్, ఏ3- ఉమాశంకర్ రెడ్డి, ఏ4 దస్తగిరి అని తెలిపిందని వివరించారు. వివేకాకు ఎర్ర గంగిరెడ్డి సన్నిహితుడిగా ఉన్నారని, ఏ1 ఎర్ర గంగిరెడ్డితో కడప ఎంపి అవినాష్‌కు మంచి పరిచయం ఉందని, సునీల్ యాదవ్‌కు కిరణ్ యాదవ్ అనే తమ్ముడు ఉన్నాడని, అవినాష్, భాస్కర్ రెడ్డితో కిరణ్ యాదవ్ ఉన్న ఫొటోలను సునీత చూపించారు.

ఉమాశంకర్‌రెడ్డికి అవినాష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను చూపించారు. వివేకాకు ఎంవి కృష్ణారెడ్డి చాలా సన్నిహితుడు అని, శివశంకర్ రెడ్డికి, ఎంవి కృష్ణారెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయని, భాస్కర్‌రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 నుంచి 16 వరకు స్విచ్ఛాఫ్ ఉందని, అవినాష్ మాత్రం వీళ్లెవరో తెలియదని చెబుతున్నారని, ఫొటోలు, ఫోన్ డేటా చూస్తే అవినాష్‌తో పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని ఆమె వివరించారు. వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరుగెడుతున్న దృశ్యాలను చూపించారు, హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా బయటపెట్టారు, ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేకౌట్, ఐపిడిఆర్ డాటా వివరాలను వెల్లడించారు. హత్య రోజు రాత్రి నుంచి ఉదయం వరకు ఏం జరిగిందో వివరించారు. హత్య జరిగిన రోజు సాక్షిలో వార్తలు, నేతల వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News