Wednesday, January 22, 2025

హైదరాబాద్‌కు చేరుకున్న వివేకా హత్యకేసు దస్త్రాలు!

- Advertisement -
- Advertisement -
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అభియోగపత్రాలు, వాంగ్మూలాలు, ఇతర దస్త్రాలు మూడు ట్రంకు పెట్టెల్లో సిబిఐ కోర్టుకు తరలించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో కేసుకు సంబంధించిన దస్త్రాలను (ఫైల్స్) హైదరాబాద్ ప్రిన్సిపల్ సిబిఐ కోర్టుకు తరలించారు. అభియోగపత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఇతర దస్త్రాలను మూడు ట్రంకు పెట్టెల్లో కడప సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు తరలించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసును ఢిల్లీ సిబిఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్‌ను కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇదివరకు సిబిఐ దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అభ్యర్థన మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. కోర్టు అభియోగపత్రాన్ని పరిశీలించి నంబర్ కేటాయించిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ ప్రక్రియ మొదలుకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News