Wednesday, January 22, 2025

వివేకా మర్డర్… ఈ పిటిషన్ లో జోక్యం చేసుకోలేము: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వివేకా నందారెడ్డి సహాయకుడు ఎంవి కృష్ణా రెడ్డి పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేసే అధికారం తనకూ ఉన్నట్లు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ కేసులో తాను కూడా బాధితుడినే అంటూ స్పష్టత ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో తాము జోక్యానికి సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం వివరించింది. వాద, ప్రతివాదుల అభిప్రాయాలు హైకోర్టు ముందే చెప్పొచ్చని ధర్మాసనం స్వతంత్రత కల్పించింది. హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీం అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చని న్యాయంస్థానం వెల్లడించింది. లిఖిత పూర్వక ఆదేశాలు గురువారం ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

Also Read: ప్రియాంక చోప్రా వీడియోపై నెటిజన్ల ఫైర్ (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News