Friday, November 22, 2024

‘వివేక’ కేసు కడప కోర్టుకు బదిలీ

- Advertisement -
- Advertisement -

Viveka murder case transferred to Kadapa court

సిబిఐ ఎఎస్‌పిపై కేసు నమోదు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిం ది. పులివెందుల మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణను బదిలీ చేయడంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రి మాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కో ర్టులోనేనని మేజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ నలుగురి సిబిఐ అభియోగ పత్రాల వివరాలు అందించా రు. నిందితుల రిమాండ్ పొడిగింపుతో పాటు అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సిబిఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువును న్యాయస్థానం 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు

సిబిఐ ఎఎస్‌పిపై కేసు నమోదు

కడప కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎఎస్‌పి రా మ్‌సింగ్‌పై 195ఎ, 323, 506, రెడ్‌విత్ 34 సె క్షన్ల కింద కేసు నమోదైంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రామ్‌సింగ్ తనను బె దిరిస్తున్నారంటూ యురేనియం కార్పొరేషన్ ఉ ద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ఉదయ్‌కుమార్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు దస్తగిరికి బెదిరింపు కాల్స్

వైఎస్ వివేకాహత్య కేసులో నిందితుడు దస్తగిరికి బెదిరింపు కాల్స్ రావడంతో సిబిఐ దృష్టికి తీసుకొచ్చాడు. ఈక్రమంలో దస్తగిరి స్టేట్‌మెంట్‌లో మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. తనని భరత్‌యాదవ్ కలిసినట్టుగా దస్తగిరి పేర్కొనడంతో పా టు ఎంపి అవినాష్‌రెడ్డి మాట్లాడుతారని, తోటలో కి రమ్మంటున్నారని భరత్‌యాదవ్ చెప్పాడని తె లిపారు. అలాగే మరోసారి ఫోన్‌లో ఇంటి వెనక ఉండే హెలిప్యాడ్ దగ్గరకు భరత్ రమ్మన్నాడని దస్తగిరి పేర్కొన్నారు. అక్కడికి భరత్‌యాదవ్‌తో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డిలు వచ్చారని తన స్టేట్ మెంట్లో పేర్కొన్నా డు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డిలు పం పించారంటూ నువ్వు మెజిస్ట్రేట్ ఎదుట వాం గ్మూలంలో చెప్పిన అంశాలు చెబితే నీకు మంచి ఆఫర్ అన్నట్లు వివరించాడు. 10.20 ఎకరాల భూమి ఇస్తాం, ఎంతడబ్బు కావాలో చెప్పాలని భ రత్, అడ్వకేట్ ఓబుల్‌రెడ్డి అడిగారని స్టేట్మెంట్‌లో దస్తగిరి పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News