Monday, November 18, 2024

వివేకా హత్య కేసు కదలిక

- Advertisement -
- Advertisement -

వివేకానందరెడ్డి పిఎ కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కదలిక మొదలైంది. వైఎస్ వివేకానందరెడ్డి పిఎ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది.

ఈ మేరకు పులివెందుల డిఎస్‌పి మురళి నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. డిఎస్‌పి అడిగే ప్రశ్నలు ఆయన చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కలిసి ఈ విషయంపై చర్చించారు.

ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్‌పిని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా కుమార్తె సహా మరికొందరిపై 2022లో కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ కేసుపై కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు డిఎస్‌పి మురళి నాయక్ తెలిపారు. ఈ కేసులో కోర్టు లేవనెత్తిన కొన్ని అంశాలపై విచారణ జరిపినట్లు వెల్లడించారు. న్యాయవాది సమక్షంలో విచారణ ప్రక్రియ సాగిందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News