Wednesday, January 22, 2025

వివేకా హత్య కేసు నేటితో ముగియనున్న విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ శుక్రవారంతో ముగియనుంది. జూన్ 30లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా, సాక్షులను, నిందితులను, అనుమానితులను సిబిఐ విచారణ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఐదు సార్లు విచారించారు. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, దస్తగిరిని కూడా విచారించారు. 2019లో కడప జిల్లా పులివేందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

Also Read: స్నేహితుడిని చంపి… రోడ్డు ప్రమాదంలో తానే మృతి చెందినట్టుగా చిత్రీకరించి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News