Thursday, January 23, 2025

వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు బదిలీపై తీర్పు వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నవంబర్ 21న తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని మరో వారం పాటు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం. సుందరేశ్ ధర్మాసనం తెలిపింది. ఇదిలావుండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు సోమవాయిదా వేసింది. బెయిల్ రద్దు విషయం కూడా హత్య కేసు దర్యాప్తు బదిలీ అంశంతో ముడిపడి ఉన్నందున అదే రోజు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News