Tuesday, January 7, 2025

వివేకానందరెడ్డి పిఎ ఫిర్యాదు… జగన్ బావమరిదికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి ఒకప్పటి పిఎ కృష్ణారెడ్డి పిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నెల 5న విచారణకు రావాలని మాజీ సిఎం జగన్ బావమరిది ఇసి సురేంద్ర నాథ్‌రెడ్డి, కడప ఎంపి అవినాష్‌రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి, తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్‌ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును మళ్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రాంసింగ్‌లు తప్పుడు సాక్షం చెప్పాలని తమపై ఒత్తిడి చేయడంతో కృష్ణారెడ్డి పిఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సునీత, రాజశేఖర్‌లు ఒత్తిడి చేసినట్టు కృష్ణారెడ్డి గతంలో ఆరోపణలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News