Monday, December 23, 2024

వివేకా హత్య కేసులో కీలక పరిణామం… సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ వివేకాహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్త గిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన ఆర్థిక స్తోమత అంతంత మాత్రమేనని, అందుకే తనకు న్యాయ సహాయం అందించాలని సుప్రీంకోర్టు లీగ ల్ సర్వీసెస్ కమిటీకి విజ్ఞాపన పంపాడు. వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన పిఎ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటి షన్ వేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానే గనుక బాధితుడిగా చూడాలని కోరారు. కానీ కృష్ణారెడ్డి అభ్యర్థనను వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు. అదే సమయంలో సిబిఐకి, అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలోనే దస్తగిరి స్పందిస్తూ, తనకు న్యాయ సహాయం అందించాలని అర్థించాడు. సుప్రీంకోర్టులో తన తరఫున న్యాయవాదిని నియ మించుకునేంత ఆర్థిక స్తోమత తనకు లేదని దస్తగిరి తెలిపాడు. అందుకే తనకు న్యాయసహాయం కల్పించాలని, అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News