Monday, December 23, 2024

వివేకా హత్య కేసు… శివశంకర్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. వివేకా హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తొలుత నిందితుడిగా అరెస్టయిన మాజీ డ్రైవర్ దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. అయితే దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శివశంకర్ రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న పిమ్మట ఆ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కొట్టివేసింది. నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News