Saturday, January 25, 2025

వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు లీక్

- Advertisement -
- Advertisement -

వివో భారతీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకరావడానికి ప్లాన్ చేస్తోంది. వివో వివో వై 29 5జి పేరిట కొత్త ఫోన్ తీసుకురాబోతోంది. అయితే, ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఫోన్ ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధర

వివో వై29 5జి ఇండియన్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానున్నది. దీని ప్రారంభ ధర రూ. 13,999గా ఉండొచ్చు. ఇది 4/128GB, 6/128GB, 8/128GB, 8/256GB వేరియంట్లలో లాంచ్ అవుతుంది. ఆఫర్ల వివరాల గురుంచి చూస్తే మొదటి సేల్‌లో EMIపై రూ. 1500 క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు.

స్పెసిఫికేషన్‌లు

డిస్‌ప్లే: ఈ ఫోన్ 6.68 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
ప్రాసెసర్: పనితీరు కోసం.. ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్షన్ 6300 SoC చిప్‌సెట్ ఇన్‌స్టాల్ చేయొచ్చు.
రంగులు: 4GB/128GB, 6GB/128GB మోడల్‌లకు గ్లేసియర్ బ్లూ, మరోవైపు 8GB/128GB కోసం టైటానియం గోల్డ్, 8GB/256GB వేరియంట్ డైమండ్ బ్లాక్ లో లాంచ్ కానున్నది.
కెమెరా: అద్భుతమైన ఫోటోల కోసం.. 50MP ప్రైమరీ కెమెరా + 0.08MP QVGA సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 8MP షూటర్తో వస్తుంది.
బ్యాటరీ: ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News