Monday, December 23, 2024

మార్కెట్లోకి వివో వై33టి

- Advertisement -
- Advertisement -

Vivo has released the latest Y33T phone

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వై33టి ఫోన్‌ని విడుదల చేసింది. వివో వై33టి హై-డెఫినిషన్ ఫోటోగ్రఫీతో 50ఎంపి వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన గేమింగ్ అనుభవం కోసం సరికొత్త క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్‌ఒసి, 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కల్గివుంది. ఈ వివో వై33టి 8జిబి+128జిబి ధర రూ .18,990గా ఉంది. ఇది మిర్రర్ బ్లాక్, మిడ్‌డే డ్రీమ్ అనే రెండు వైబ్రెంట్ రంగుల్లో వస్తోంది. ఈ నెల 10 నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇస్టోర్, పేటీఎం, ఇతర స్టోర్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News