- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త ఎక్స్90 సిరీస్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో రెండు ఎక్స్‌ట్రీమ్ ఇమేజింగ్ ఫ్లాగ్‌షిప్ పరికరాలు వానిలా వివో ఎక్స్90, ప్రీమియం వివొ ఎక్స్90 ప్రొ ఉన్నాయి. ఎక్స్90 ప్రొ 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.84,999గా నిర్ణయించారు. వివొ ఎక్స్90 రూ. 59,999 (8జిబి+256జిబి), రూ.63,999 (12జిబి+256జిబి) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మే 5 నుండి ఫ్లిప్‌కార్ట్, వివొ ఇండియా ఇ-స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
- Advertisement -