Wednesday, January 22, 2025

6000 ఎంఎహెచ్ బ్యాటరీతో వివో టి3ఎక్స్ 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సరికొత్త వివో టి3ఎక్స్ 5జి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 120 హెట్జ్ రిఫ్రెష్‌తో ఫుల్ హెచ్‌డి ప్లస్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ఎస్‌ఒసి వంటి ఫీచర్లు ఉన్నాయి. వివో టి3ఎక్స్ 5జి మల్టీ టాస్కింగ్, ఇది 6000 ఎంఎహెచ్ బ్యాటరీని కల్గివుంది. 44డబ్లు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం, అధునాతన డిజైన్‌తో ఇది ఖచ్చితమైన మిడ్-రేంజర్‌గా నిలుస్తుంది. రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. వివో టి3ఎక్స్ 5జి ధర 4జిబి+128జిబి వేరియంట్‌కు రూ.13,499, 6జిబి+128జిబి వేరియంట్‌కు రూ. 14,999, 8జిబి+ 128జిబి వేరియంట్‌కి రూ 16,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి వస్తుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News