Thursday, January 23, 2025

డబ్బు కోసమే కిడ్నాప్: డిజిపి రాజేంద్రనాథ్

- Advertisement -
- Advertisement -

విశాఖ: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్‌కు సంబంధించి డిజిపి రాజేంద్రనాథ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని వెల్లడించారు. ముందుగా ఎంపి కుమారుడిని కిడ్నాప్ చేశారు. కుమారుడితో ఫోన్ చేయించి తల్లిని రప్పించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నామని తెలిపారు. కిడ్నాపర్లు రూ. కోటి 75 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 86 లక్షలు రికవరీ చేశామన్నారు.

కత్తితో చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పిడి యాక్ట్ నమోదు చేశామని డిజిపి వెల్లడించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని, రౌడీషటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉందన్నారు. పోలీసులు అలర్ట్ గా ఉన్నారు కాబట్టే.. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోగలిగామని స్పష్టం చేశారు. ఎపిలో క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు డిజిపి రాజేంద్రనాథ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News