విశాఖప ట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి ప్పుడు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని భావించడం లేదని చెప్పారు. గురువారం విశాఖపట్నంలో పోర్ట్ కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విశాఖ స్టీ ల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం లేదని అన్నారు. దీనిపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు. దానికంటే ముందు రా ష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లి మిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ను బలోపేతం చేసే పని లో ఉన్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామన్నారు. ముడిసరుకు పెంపొందించే ప్ర క్రియపై దృష్టి పెట్టినట్లు తెలిపా రు.
ఇదే మంత్రి రాజ్యసభలో ఫిబ్రవరి 13న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్న కు బదులిస్తూ సూత్రప్రాయంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను 100 శాతం డిసిన్వెస్ట్‌మెంట్‌కు అంగీకరించామని లి ఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు.ఆర్‌ఐఎన్‌ఎల్ ఆధ్వర్యంలో నడిచే వైజాగ్ ఉక్కు ఫ్యా క్టరీని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఉందా వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా స్పష్టంగా చెప్పారు. కాని గురువారం ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని చెప్పడం గమనార్హం. వైజాగ్ ఉక్కుపై రెండేళ్లుగా అక్కడి కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారు పలు రకాలుగా ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. వైజాగ్ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా చూడాలని వారు అన్ని పార్టీలను కలిసి విజ్ఞప్తులు చేశారు.
గత మూడు రోజులుగా బిఆర్‌ఎస్ ఎపి అద్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు అండగా పోరాటం చేశారు. స్టీల్ ప్లాంట్ మార్కెట్ విలువ మూడు లక్షల కోట్లు అని అకౌంట్‌లో చూపించింది కేవలం రూ. 397 కోట్లు అని ప్రైవేటీకరణ చేస్తే జరుగబోయేది కళ్ళకు కట్టినట్లు ఎపి బిఆర్‌ఎస్ అద్యక్షులు తోట చంద్రశేఖర్ బహిర్గతం చేశారు.
Also Read: కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం లేదు..
కెసిఆర్ వల్లే కేంద్రం వెనుకడుగు : లక్ష్మినారాయణ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే కేంద్రం పునరాలోచనలో పడిందని మాజీ జెడి లక్ష్మినారాయణ అన్నారు. ఈఓఎల్‌లో పాల్గొనేందుకు తె కెసిఆర్ ఆసక్తి చూపడంపై ఆయన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బృందం రావడం వల్లే ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్ళకూడదని ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోడానికి కారణమైందని ఆయనన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.