Monday, December 23, 2024

ప్రేమజంటను ఎస్‌ఐనని బెదిరించి… యువతిపై హోంగార్డు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎస్‌ఐనని ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిపై హోంగార్డు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు హోంగార్డును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మొయిద సురేష్ అనే వ్యక్తి బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై సురేష్ సొంతూరుకు వెళ్తున్నాడు. కొండకరకం గ్రామ శివారులో ఓ ప్రేమ జంట కనిపించడంతో వారిని తాను ఎస్‌ఐనని బెదిరించాడు. దీంతో ప్రేమికుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని ఆమె గ్రామానికి వెళ్లే బస్సును ఎక్కిస్తానని బైక్‌పై ఎక్కించుకొని రామతీర్థం సమీపంలోని చంపానది ఓడ్డున నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి ఆమెపై హోంగార్డు సురేష్ అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి రామతీర్థం ఎక్స్‌రోడ్డులో ఆమెను వదిలిపెట్టాడు. నెల్లిమర్ల పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌పి వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News