Monday, December 23, 2024

ప్రియుడ్ని కట్టేసి… ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ భక్షకుడిగా మారాడు. ఒంటరిగా దొరికిన ప్రేమ జంటను అదుపులోకి తీసుకొని ప్రియుడ్ని కట్టేసి… అతడి ముందే ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజ్ కుమార్ అనే హోంగార్డు డిఎస్‌పి వద్ద పని చేస్తున్నాడు. ఓ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఏకాంతం కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. హోంగార్డు రాజ్ కుమార్ ప్రేమ జంటను గుర్తించి వారి వద్దకు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు రమ్మని వారిని బెదిరించాడు. తమను వదిలివేయాలని వారు బతిమాలాడు. డబ్బులు డిమాండ్ చేయడంతో కొంత నగదు ముట్టజెప్పారు. అనంతరం ప్రియుడ్ని హోంగార్డు కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం చేసి పారిపోయాడు. వెంటనే ప్రియుడు తన ప్రియురాలిని తీసుకొని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు పరారీలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News