Monday, January 20, 2025

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా మద్దిలపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వంగర మండలం కొట్టిశ గ్రామానికి చెందిన శంకర రావు (37)కు 2010లో స్సెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగం  వచ్చింది. శంకరరావుకు భార్య శ్రావణి, కుమారుడు చంద్రదేవ్(6), నవిత(3) అనే కూతురు ఉంది. తన కుటుంబం సభ్యులతో కలిసి మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో విధుల నిర్వహిస్తుండగా శంకర రావు తుపాకీ తో గుండెలపై కాల్చుకున్నాడు. తుపాకీ పేలిన శబ్ధం రావడంతో తోటి ఉద్యోగులు వచ్చేసరికి అతడు రక్తపు మడుగులో కనిపించాడు. సిబ్బంది సమాచారం మేరకు ఎసిపి, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్యకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News