Wednesday, January 22, 2025

చిరంజీవి, బాలకృష్ణలోని గొప్ప లక్షణం అది.. శేఖర్ మాస్టర్ తో ఇంటర్వ్యూ..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ’వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ’వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న విడుదలవుతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇప్పటికే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. ’వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు విజె శేఖర్ మాస్టర్. అలాగే ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలు సుగుణ సుందరి, మా బావ మనోభావాలు కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
టెన్షన్‌గా, ఆనందంగా ఉంది…
పాటలు చేస్తున్నప్పుడు వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి పండగకు వస్తాయని తెలియదు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేశాను. ఇప్పుడు రెండు సినిమాల పాటలు, లిరికల్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతుండటంతో టెన్షన్‌గా, చాలా ఆనందంగా ఉంది.
వారిలోని గొప్ప లక్షణం అది…
చిరంజీవి, బాలకృష్ణలో ఉన్న గొప్ప లక్షణం అంకితభావం. ఒక మూమెంట్ వస్తే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ అంకితభావం ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలివి.
కాస్త ఎక్కువగానే కష్టపడ్డాం…
‘వాల్తేరు వీరయ్య’లో ఐదు పాటలు వున్నాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. ప్రతి పాటని డిఫరెంట్‌గా చేశాం. ఈ విషయంలో కాస్త ఎక్కువగానే కష్టపడ్డాం. ఒకటి మాస్, మరొకరి క్లాస్‌లో మాస్, మరొకటి ఫుల్ మెలోడి.. ఇలా చేయడానికి కొంచెం ఎక్కువ వర్కవుట్ చేయాల్సి వచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ మెలోడి పాట కోసం ఫారిన్ వెళ్లాం. అక్కడ మైనస్ 10 డిగ్రీల వద్ద పని చేశాం.
భయంకరమైన ఎండలో చేశాం…
‘వీరసింహా రెడ్డి’లోని సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. అక్కడ ఫుల్ ఎండలు. ‘వాల్తేరు వీరయ్య’ చలిలో అయితే దానికి పూర్తి భిన్నంగా సుగుణ సుందరి పాటని భయంకరమైన ఎండలో షూట్ చేశాం. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఇందులో బెల్ట్, నాడ స్టెప్‌ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కోసం స్పెషల్‌గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా చేస్తున్నా. అలాగే రవితేజతో రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News