Friday, November 15, 2024

పంజాబ్ కొత్త డిజిపిగా వీకే భావ్రా

- Advertisement -
- Advertisement -

VK Bhavra is the new DGP of Punjab

చండీగఢ్: పంజాబ్ నూతన డిజిపిగా వీకె భవ్రా నియమితులయ్యారు. ప్రధాని ఫిరోజ్ పూర్ టూర్ లో భద్రతా లోపాలు తలెత్తడంతో డిజిపిని మార్చేశారు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించడానికి కొన్ని గంటల ముందు, చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం 1987-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి అయిన వీకె భవ్రాను రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా నియమించింది. జనవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘనల కారణంగా పరిశీలనను ఎదుర్కొంటున్న తాత్కాలిక డిజిపి సిద్ధార్థ్ చటోపాధ్యాయ నుంచి భావ్రా బాధ్యతలు స్వీకరించారు. వీరేష్ కుమార్ భవ్రా రెండుసంత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. గతంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని అత్యున్నత పోలీసు పోస్టు కోసం మాజీ డిజిపి దినకర్ గుప్తా, భావ్రా, ప్రబోధ్ కుమార్‌లతో సహా ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో వీకె భవ్రాకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News