Sunday, January 19, 2025

రాజకీయాలకు వికె. పాండియన్ గుడ్ బై!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఎంతో నమ్మకస్తుడు అయిన వికె. పాండియన్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (బిజెడి) ఘోరంగా ఓడిపోయాక పాండియన్ ఈ ప్రకటన చేశారు. దీనికి ముందు పాండియన్, పాట్నాయక్ వారసుడు కాబోడని, ప్రజలే ఏం కావాలో నిర్ణయిస్తారన్న ప్రకటన కూడా నవీన్ పాట్నాయక్ చేశారు.

పాండియన్ ఐఏఎస్ 2000 బ్యాచ్ కు చెందిన అధికారి. రెండు దశాబ్దాలుగా నవీన్ పట్నాయక్ కు పిఏగా పనిచేశారు. 2023లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక బిజూ జనతా దళ్ లో చేరారు. 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ శకానికి భారతీయ జనతా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో మంగళం పాడింది. ఒడిశాలోని 147 సీట్లలో బిజెపి78, బిజెడి 51, కాంగ్రెస్ 14, సిపిఎం 1 గెలుచుకున్నాయి. విశేషం ఏమిటంటే నవీన్ పట్నాయక్ స్వయంగా తన రెండు సీట్లలో ఒకటైన కాంతాబంజీలో ఓడిపోయారు. కానీ హిజిలీ నుంచి వరుసగా ఆరోసారి గెలిచారు. పాతికేళ్లుగా ఒడిశాను పాలించిన నవీన్ పాట్నాయక్ శకం ముగిసినట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News