Friday, November 22, 2024

చెన్నై చేరుకున్న శశికళ

- Advertisement -
- Advertisement -

VK Sasikala reached Chennai

 

ఫోన్‌లో రజనీకాంత్ పరామర్శ

చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కొవిడ్ చికిత్సను పూర్తి చేసుకుని బెంగళూరు నుంచి బయల్దేరిన ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నెచ్చెలి వికె శశికళ దాదాపు 23 గంటల తర్వాత మంగళవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. 65 సంవత్సరాల శశికళ మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టి నగర్ చేరుకున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి కారులో బయల్దేరిన శశికళకు దారిపొడవునా ఆమె మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ పోటీ చేసే అవకాశం ఉందని ఇదివరకే సూచనప్రాయంగా వెల్లడించిన ఆమె బంధువు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఎఎంఎంకె) నాయకుడు టిటివి దినకరన్ మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎఐఎడిఎంకెకు విముక్తి కల్పించే ప్రయత్నాలు కొనసాగతాయని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో డిఎంకెను అధికారంలోకి రాకుండా చేయడమే తమ ముందున్న ఏకైక లక్షమని ఆయన చెప్పారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ చేసి శశికళ ఆరోగ్యం గురించి వాకబు చేశారని ఆయన తెలిపారు.

టి నగర్‌లోని తన నివాసానికి చేరుకునే ముందు శశికళ రామాపురంలో ఉన్న ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ నివాసాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడ ప్రతిష్టించిన ఎంజీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News