Thursday, January 23, 2025

డిసిడబ్ల్యూలో కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిబంధనలు పాటించకుండా ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యూ)లో నియమించిన 223 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ఆమోదం తెలియచేసినట్లు అధికారులు గురువారంతెలిపారు. నిబంధనలను పాటించకుండా కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన 223 మంది ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిసిడబ్లుని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. కాగా..ఈ ఉత్తర్వులపై డిసిడబ్లు మాజీ చైర్‌పర్సన్, ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మండిపడ్డారు.

డిసిడబ్లు కాంట్రాక్టు ఉత్యోగులను తొలగిస్తూ ఎల్ సక్సేనా తుగ్లక్ ఉత్తర్వులు జారీచేశారని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. మహిళా కమిషన్‌లో మొత్తం 90 మంది సిబ్బంది ఉన్నారని, వీరిలో 8 మందికి మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, మిగిలిన వారంతా ఒక్కొక్కరు 3 నెలల కాంట్రాక్టుపై పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగిస్తే మహిళా కమిషన్‌కు తాళం పెట్టాల్సిందేనని ఆమె చెప్పారు. తమ రక్తం, స్వేదంతో ఈ సంస్థను తయారు చేశామని, సిబ్బందిని, రక్షణను కల్పించాల్సింది పోయి దాన్ని సమూలంగా ఎందుకు నాశనం చేస్తున్నారని స్వాతి ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంత వరకు మిళా కమిషన్ మూతపడకుండా కాపాడుతానని ఆమె స్పషం చేశారు. తనను జైలులో పెట్టండి కాని మహిళలను మాత్రం అణచివేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News