- Advertisement -
మాస్కో : గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధం అనుచితం అని, ఆమోదయోగ్యం కాదని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలు లెనిన్‌గ్రాడ్‌ను కైవసం చేసుకోవడంతో ఇప్పటి పరిణామాన్ని పోల్చుకోవచ్చునని పుతిన్ వ్యాఖ్యానించారు. హమాస్ ఇజ్రాయెల్ దాడుల దశలో రష్యా ఇప్పటివరకూ తటస్ఠతనే ప్రదర్శించింది. పైగా ఇరుపక్షాల మధ్య తాము రాజీకి యత్నిస్తామని రెండు రోజుల క్రితం పుతిన్ ప్రకటించారు. అయితే లెబనాన్, సిరియాలపై దాడులు, గాజాను అన్ని విధాలుగా దిగ్బంధించడం పట్ల ఇజ్రాయెల్‌పై పుతిన్ తొలిసారిగా తమ నిరసన వ్యక్తం చేశారు. కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షులు ప్రస్తుత విషయంపై విలేకరులతో మాట్లాడారు. గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ చర్య నాజీలను తలిపిస్తోందని పుతిన్ మండిపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.
- Advertisement -