Wednesday, January 22, 2025

పుతిన్ మోడీ ఫోన్ సంభాషణ

- Advertisement -
- Advertisement -

మాస్కో : భారత ప్రధాని మోడీ , రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం కొద్ది సేపు ఫోన్ సంభాషణ సాగింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశలో మరిన్ని చర్చలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంకల్పించారు. వీరి సంభాషణ అర్థవంతంగా జరిగిందని రష్యా అధికారిక కేంద్రం అయిన క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ ఘర్షణపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. రష్యాలో ఇటీవల జరిగిన తిరుగుబాటు గురించి , ప్రిగోజిన్ వ్యవహారం గురించి పుతిన్ ఈ దశలో పుతిన్ తెలిపారు.

ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి సారించరు. ఇండియా సారధ్యంలో ఇటీవలి జరిగిన షాంఘై సహకార సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతల నడుమ జరిగిన పరోక్ష సమావేశం తరువాత ఇప్పుడు ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. దౌత్యప్రక్రియలో ఘర్షణను నివారించుకోవాలని పుతిన్ చేసిన సూచనను ఉక్రెయిన్ తోసిపుచ్చిందని ఈ దశలో మోడీకి తెలియచేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటి సైనిక చర్యను పుతిన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News