Saturday, November 16, 2024

ఉక్రెయిన్ పై తమ లక్ష్యాలేవి మారలేదు : పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో : ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాలేవి మారలేదని, వాటిని సాధించేవరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్ నిస్సైనికీకరణ, నాజీవాదం నిర్మూలన, తటస్థ వైఖరి అవలంబించాలనే లక్షాలతో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నాటో దేశాలతో మైత్రి సాగించకూడదని ఆయన డిమాండ్ చేశారు. పుతిన్ దాదాపు 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సెంట్రల్ మాస్కోలో హాలులో ఆయన ప్రవేశించగానే చప్పట్లతో సభికులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై 22 నెలలు కావస్తోంది. ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అరుదైన సమాచారాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దాదాపు 6.17 లక్షల మంది రష్యా సైనికులు ఉన్నారు. వారిలో దాదాపు 2.24 లక్షల మందిని సుశిక్షిత సైనిక బలగాలతో కలిసి పోరాడేందుకు సమీకరించాం. ప్రస్తుతానికి మరో సైనిక సమీకరణ అవసరం లేదు. దేశ వ్యాప్తంగా రోజూ 1500 మంది కొత్తగా సైన్యంలో చేరుతున్నారు. బుధవారానికి 4.86 లక్షల మంది సైనికులు రష్యా సైన్యంతో సంతకాలు చేశారు” అని పుతిన్ వెల్లడించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాత్రికేయులతోపాటు సామాన్య పౌరుల నుంచీ ఫోన్ ద్వారా ప్రశ్నలను ఆహ్వానించారు. రెండు వారాల వ్యవధిలో దాదాపు 20 లక్షల ప్రశ్నలు వచ్చినట్టు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. గత ఏడాది పుతిన్ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించలేదు. 24 ఏళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News