Monday, December 23, 2024

సర్మత్ అణు క్షిపణులను మోహరించనున్న రష్యా: పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా తన అణు బలగాలను పెంచుకోవడంపై శ్రద్ధ చూపుతోంది. అందుకు కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని మోహరించడం, హైపర్‌సోనిక్ క్షిపణులను రోలింగ్ చేయడం, కొత్త అణు జలాంతర్గములను జోడించడం చేస్తోంది. పుతిన్ మంగళవారం ఉక్రెయిన్‌తో అణు ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని నిలిపివేసి, రష్యా సంకల్పాన్ని నొక్కి చెప్పారు. యుద్ధ సన్నద్ధతకు కొత్త వ్యూహాత్మక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక అణు పరీక్షలను రష్యా పునఃప్రారంభించనున్నట్లు హెచ్చరించారు.

ఇదివరకటి సోవియట్ కాలంలో ‘రెడ్ ఆర్మీ డే’గా పిలువబడే ‘డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్‌ల్యాండ్’ పబ్లిక్ హాలిడే సందర్భంగా ఆయన ప్రసంగించారు. రష్యా సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోడానికి ఆధునీకరించిన సాయుధ బలగాలు అవసరమన్నారు. పశ్చిమ దేశాల కుయుక్తుల నుంచి రష్యా అస్తిత్వాన్ని పరిరక్షించుకోడానికే ఉక్రెయిన్‌పై దాడిచేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సర్మత్ సైలో ఆధారిత ఖండాతర బాలిస్టిక్ క్షిపణులను ఈ సంవత్సరం మోహరిస్తాం’ అని తెలిపారు. ‘సాతాన్2’ అనే మారుపేరు ఆర్‌ఎస్28 సమ్రత్ ద్రవ ఇంధన క్షిపణి గురించి పుతిన్ 2018లో ప్రకటించారు. వాటిని గత సంవత్సరమే మోహరించాల్సి ఉండింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News