Monday, January 20, 2025

పుతిన్‌కు ఎదురేలేని ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

రష్యా మరో ఆరేండ్ల పాటు వ్లాదిమిర్ పుతిన్ ఏలుబడిలోనే కొనసాగనుంది. ఆదివారం ఈ విషయం సుస్పష్టం అయింది. రష్యాలో అధ్యక్ష పదవికి మూడు రోజుల ఎన్నికల ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. పుతిన్‌కు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ నేత లేకపోవడంతో ఈ ఎన్నికల ఫలితం పూర్తి స్థాయిలో ఇక ఏకపక్షంగా పుతిన్ వైపు మొగ్గు చూపుతుందని ఖాయం అయింది. ఆదివారం ఎన్నికల ప్రక్రియ కేవలం నామమాత్రంగా కేవలం నిర్వహణపరమైన రికార్డుల ప్రదర్శన తంతుగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన ఆంక్షల వాతావరణం నడుమ దేశాధ్యక్ష పదవికి పోలింగ్ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుతిన్‌పై బహిరంగ ప్రజా విమర్శలు ఉండరాదు. ఉక్రెయిన్‌పై నిరసనలు వ్యక్తం చేయరాదనే కటుతర ఆంక్షల నడుమ ఎన్నికలు ఆరంభమయ్యాయి. గత నెలలోనే పుతిన్‌కు అత్యంత కీలక రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ తన కారాగార జీవిత దశలోనే విషాదాంతం చెందాడు. కాగా పుతిన్ ఇతర విమర్శకులు చాలా మంది జైలుపాలయి ఉన్నారు.

దీనితో 71 సంవత్సరాల కాకలు తీరిన నేత పుతిన్‌కు గట్టి పోటీ ఏమీ లేకుండా ఉంది. కాగా ఇప్పుడు కేవలం ఎన్నికల ప్రక్రియ సార్థకతకు పుతిన్‌కు వ్యతిరేకంగా పెద్దగా పేరు లేని నేతలు రంగంలో ఉన్నారు. వారు కూడా క్రెమ్లిన్ మిత్రపక్ష పార్టీలకు చెందిన వారే కావడం , పుతిన్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనని పార్టీలే కావడం కీలకం అయింది. ఇప్పుడు జరిగే ఎన్నిక తరువాతి ఖాయమైన ఫలితంతో ఇక రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ అధికార పర్వం పాతికేళ్ల కాలాన్ని దాటుతుంది. ఇప్పటికే ఆయన పాలనకు 24 ఏండ్లు. ఇక మరో ఆరు సంవత్సరాలు రష్యా పుతిన్ అధికారిక ముద్రలోనే సాగాల్సి ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో పుతిన్ ఎక్కువగా రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దాడి క్రమంలో పలు విజయాలు సాధిస్తున్నట్లు చెప్పడంతోనే సరిపోతోంది. ఇతరత్రా కీలక విషయాలను వేటిని ఆయన ప్రస్తావించడం లేదు. కాగా ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరగడం మాస్కోకు ఉన్న ముప్పును తలపింపచేసింది.

ఏకంగా 35 ఉక్రెయిన్ డ్రోన్లనునేల కూల్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దాడి తీవ్రతను వివరించలేదు. మాస్కో సమీపంలో కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహానీ జరగలేదని రష్యా మేయర్ సెర్గీ సోబ్యనిన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News