Sunday, January 19, 2025

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 71ఏళ్ళ వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. దీంతో ఐదవసారి ఆయన రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలలో పుతిన్ 88 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. పుతిన్‌కు మరో ప్రత్యామ్నాయ నేత లేకపోవడంతో ఈ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరిగాయి. దీంతో రష్యా మరో ఆరేండ్ల పాటు పుతిన్ ఏలుబడిలోనే కొనసాగనుంది.

1999 నుంచి 24 ఏండ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నపుతిన్‌.. మరో 6 సంవత్సరాలు ఆ దేశ అధ్యక్షడిగా కొనసాగనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్‌ స్టాలిన్‌ను పుతిన్ వెనక్కి నెట్టనున్నారు. మే 7న పుతిన్ రష్యా అధ్యక్షడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News