దుబాయ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం అరబ్ దేశాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) పుతిన్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో గత కొన్ని రోజులుగా రష్యా విడిచి బయటకు వెళ్లడానికి పుతిన్ భయపడ్డారు. అప్పటినుంచి ఆయన వర్చువల్ గానే అన్ని సదస్సుల్లో పాల్గొంటున్నారు. బుధవారం సౌదీ అరేబియాకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరారు. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల దృష్టా అరబ్ దేశాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిబంధనలకు అరబ్ దేశాలు కట్టుబడక పోవడంతో అరబ్ దేశాల నుంచి తనకు రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి బుధవారం ఆయన చేరుకోగానే ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ పుతిన్‌కు స్వాగతం పలికారు. వాణిజ్యపరంగా సంబంధాలు పటిష్టపర్చుకోవాలన్నదే పుతిన్ ఆకాంక్ష
అరబ్ దేశాల్లో పుతిన్ పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -