Monday, November 25, 2024

అమెరికాకు రష్యా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ కనుక 2026 నుంచి జర్మనీలో దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించినట్లయితే రష్యా పశ్చిమ దేశాలకు సమీపంలో అటువంటి క్షిపణులను నియోగించగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం అమెరికాను హెచ్చరించారు. నాటో, యూరోపియన్ రక్షణ పట్ల తమ నిబద్ధతకు సూచికగా 2026లో జర్మనీలో దీర్ఘ శ్రేణి క్షిపణులను అమెరికా మోహరించడం ఆరంభిస్తుందని అమెరికా, జర్మనీ ఈ నెల ప్రథమార్ధంలో ప్రకటించాయి. పూర్వపు సామ్రాజ్యవాద రాజధాని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా నౌకాదళ దినోత్సవం సందర్భంగా రష్యా, చైనా,

అల్జీరియా, భారత్ నావికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగిస్తూ, అమెరికా ఆ పని చేసినట్లయితే ప్రచ్ఛన్న యుద్ధం తరహా క్షిపణి సంక్షోభానికి దారి తీయవచ్చునని హెచ్చరించారు. ‘అటువంటి క్షిపణులు మా భూభాగంపై లక్షాలు చేరుకోవడానికి దాడాపు పది నిమిషాలు పట్టవచ్చు. వాటికి భవిష్యత్తులో అణ్వస్త్రాలు అమర్చవచ్చు’ అని పుతిన్ సూచించారు. ‘అమెరికా చర్యలు, యూరప్‌లోను. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోను దాని ఉపగ్రహాలను పరిగణనలోకి తీసుకుని మేము అటువంటి క్షిపణులు మోహరిస్తాం’ అని పుతిన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News