Sunday, December 22, 2024

పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు “మిస్టర్ బచ్చన్,” “విశ్వం,” “మా కాళి,”, “స్వాగ్”తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాను, మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అర క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది.” అని ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ ఆదిత్య సినిమాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు సరైన కారణాలు తెలియ రాలేదు. కానీ సదరు దర్శకుడిని మాత్రం బాగా బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు వంటి మూడు సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేయడం తో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాలను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేస్తుందని ఆశిస్తూ దర్శకుడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వి.ఎన్ ఆదిత్య తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో 200 రోజుల పాటు దిగ్విజయంగా ఆడిన “మనసంతా నువ్వే” సినిమా డైరెక్ట్ చేసి ఆదిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నేనున్నాను అంటే ఎమోషనల్ సినిమాతో మరోసారి మంచి హిట్ సాధించారు. “బాస్” మూవీ తో కూడా విజయం సాధించారు. అనంతరం ఇప్పటిదాకా ఆయన ఒక్క మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. 2011 తర్వాత ఆయన తెలుగు సినిమాలే చేయలేదు. 2018లో ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు దానివల్ల వచ్చిన గుర్తింపు ఏమీ లేదు.

తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మూడు సినిమాలు తీశాడు అవి మాత్రం రిలీజ్ రావడం లేదు. కార్తికేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, ధమాకా వంటి సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది. మరి ఇలాంటి వీరిపై ఆరోపణ రావడం దానికి ఒక చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News