Sunday, December 22, 2024

గ్రాండ్ గా #VNRTrio లాంచ్..

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ ఫుల్ కాంబినేషన్‌ లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.#VNRTrio దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందనలు తమ గత చిత్రం ‘భీష్మ’ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేసి మేకర్స్ చాలా క్యూరియాసిటీని  క్రియేట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ డెడ్లీ కాంబినేషన్‌ లోని క్రేజీ ప్రాజెక్ట్ శుక్రవారం ఉదయం గ్రాండ్‌ గా ప్రారంభమైయింది.

#VNRTrio Grand Opening Ceremony

ముహూర్తం షాట్‌ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ మలినేని తొలి షాట్‌ కి దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్క్రిప్ట్‌ ని మేకర్స్‌ కి అందజేశారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో భాగం కానున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

#VNRTrio Grand Opening Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News